అద్భుతం: బియ్యం ఆవాలతో శివలింగం ఆకారం
SDPT: కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని గజ్వేల్‌లోని అద్దాల మందిరం వద్ద భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత కళాకారుడు రామకోటి రామరాజు బియ్యం, ఆవాలతో శివలింగం ఆకారాన్ని అద్భుతంగా తయారుచేసి ఆవిష్కరించారు. అంతేకాకుండా లింగం ఆకారం చుట్టూ దీపాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుడిచ్చిన చేతి కళను భగవంతుని సేవకే ఉపయోగిస్తున్నానని రామకోటి రామరాజు అన్నారు.