మాచర్లలో యువకుడి అనుమానాస్పద మృతి
PLD: మాచర్లలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం రహదారిలో గల గ్యాస్ గోదాము పక్కన ఉన్న తారు ప్లాంటు వద్ద యువకుడి తలకు తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. హత్యా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.