ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన డీఎంహెచ్‌వో

HNK: కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న వంగపల్లి, మరిపల్లిగూడెం ఉప కేంద్రాలను గురువారం హనుమకొండ జిల్లా DMHO, అప్పయ్య సందర్శించారు. ఈ సందర్భంగా బాలింత సేవలు, వయోవృద్ధుల సేవలు, ఉప కేంద్రంలో అందుతున్నటువంటి సేవలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ప్రసవానంతరం సంవత్సరం వరకు కూడా తల్లులకు ఫాలోఅప్ సేవలు అందించాలన్నారు.