VIDEO: ఘనంగా ప్రారంభమైన సౌడమ్మ జాతర

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం కోడూరులో సోమవారం సౌడమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పెద్దఎత్తున మహిళలు బోనాలను భేరీ చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయం వద్దకు వచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో యాదవులు, భక్తులు తరలివచ్చి ఓ లింగా.. ఓ లింగా నామస్మరణతో జాతర మార్మోగింది.