ఘనంగా ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
కృష్ణా: గుడివాడలోని షా గులాబ్ చంద్ ప్రథమశ్రేణి శాఖ గ్రంథాలయ వారోత్సవాలు బాలబాలికల ఆనందోత్సాహాల మధ్య గురువారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈవో బాలాజీ పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. గ్రంథాలయాలు సామాజిక సంపద అని, ప్రతి ఒక్కరు వాటి పరిరక్షణకు కృషి చేయాలిని సూచించారు.