రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపిన CPM నాయకులు

KMM: జిల్లా మధిర మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు గత 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేసే నాధుడే లేడని నిరసన వ్యక్తం చేస్తూ శనివారం మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మధిర మండల CPM పార్టీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని వారి సంఘీభావం తెలియజేశారు.