సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

RR: షాద్ నగర్ పట్టణంలోని 2వ వార్డులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మున్సిపల్ కమిషనర్‌తో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, అంతర్గత రహదారులు, విద్యుత్ స్తంభాల సమస్యలను ప్రజలు ఎమ్మెల్యేకు వివరించగా.. త్వరలోనే సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.