'ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి'

'ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి'

నిర్మల్ జిల్లా పరిధిలోని గిరిజన విద్యార్థులు 2025- 26 విద్యాసంవత్సరానికి గాను ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు పొందడానికి డిసెంబరు 10 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జె. అంబాజీ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆధార్, కుల, ఆదాయ, నివాస తదితర వివరాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు.