శ్రీ కోదండ రామాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శ్రీ కోదండ రామాలయంలో జరిగిన శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మీ దాంపత్య మహోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకులచే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.