టీడీపీ సీనియర్ నాయకుడి మృతికి ఎమ్మెల్యే నివాళి
E.G: తాళ్లపూడి మండలం పోచవరం PACS ఛైర్మన్ అనపర్తి ప్రసాద్ తండ్రి, పోచవరం మాజీ సర్పంచ్ అనపర్తి పరమేశ్వరరావు సోమవారం అకాల మరణం చెందారు. టీటీపీ సీనియర్ నాయకుడు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పరమేశ్వరరావు భౌతికకాయానికి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు నివాళులుర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.