సైన్యంలోకి కొత్త లైట్ మెషిన్ గన్స్

సైన్యంలోకి కొత్త లైట్ మెషిన్ గన్స్

దేశ సాయుధ దళాల సామర్థ్యం, శక్తిని పెంచేందుకు భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌ నుంచి భారీ మొత్తంలో లైట్‌ మెషిన్‌ గన్స్‌‌ను కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ తొలి దశలో వచ్చే ఏడాది 40 వేల LMGలను భారత్‌కు సరఫరా చేయనుంది. వీటిని దేశ సరిహద్దుల్లోని ఫ్రంట్‌లైన్ దళాలు ఉపయోగించనున్నాయి.