VIDEO: ఏడుపాయలలో ప్రత్యేక అలంకరణలో దుర్గ మాత
MDK: పాపన్నపేట మండలం నాగసనపల్లి శివారులోని ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని మాత గురువారం ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. మార్గశిర మాసం శుక్ల పక్షం సప్తమి పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ అమ్మవారికి పంచామృతాలు, మంజీరా నది జలాలతో అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి మంగళహారతి ఇచ్చారు.