భవనంపై నుంచి పడి కూలీ మృతి
MDCL: నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి పడి కూలీ మృతి చెందిన ఘటన ఉప్పల్ జరిగింది. పోలీసుల వివరాలు.. భగాయత్లోని నిర్మాణంలో ఉన్న భవనంలో సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన ద్వారకా ప్రసాద్ (కూలీ) ప్రమాదవశాత్తు 3వ అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో భవన యాజమాని హర్షసాయి, బిల్టర్ తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.