పోలీస్ ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు : సీపీ
NZB: ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపీ ప్రజల నుంచి 17 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు.