'జీవవైవిధ్య పరిరక్షణకు గ్రీన్‌ సోల్జర్స్‌ అవసరం'

'జీవవైవిధ్య పరిరక్షణకు గ్రీన్‌ సోల్జర్స్‌ అవసరం'

VSP: జీవవైవిధ్య పరిరక్షణ కోసం విద్యార్థులు గ్రీన్‌ సోల్జర్స్‌గా మారాలని గ్రీన్‌ క్లైమేట్‌ టీమ్‌ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. ఎంవిపి కాలనీలోని సమత డిగ్రీ కాలేజీలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడవులు, సమస్త జీవరాశి పరిరక్షణ మానవాళి బాధ్యత అని తెలిపారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సరాబంది పాల్గొన్నారు.