VIDEO: ఈతకోటలో ఘనంగా గ్రామ దేవతల జాతర మహోత్సవం
కోనసీమ: రావులపాలెం మండలం ఈతకోటలో శ్రీ ఎరిణమ్మతల్లి, పోలేరమ్మతల్లి అమ్మవార్ల జాతర మహోత్సవం సోమవారం రాత్రి అత్యంత ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులు పాటు జరగనున్న ఈ తీర్థానికి గ్రామ కమిటీ సభ్యులు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి జాతరను ప్రారంభించారు. భాజాభజంత్రీలు, గరగలు, శక్తివేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి.