VIDEO: శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అమృత సంవాద కార్యక్రమం
TPT: శ్రీకాళహస్తీ రైల్వే స్టేషన్‌లో శనివారం అమృత సంవాద కార్యక్రమం జరిగింది. స్టేషన్ మాస్టర్ మన్మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన 2 వేల స్టేషన్లలో శ్రీకాళహస్తి ఒకటి కావడం హర్షణీయమన్నారు. ఈ మేరకు ప్రయాణికులు ఎలాంటి సదుపాయాలు కోరుతున్నారో ? తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. కాగా, రాహు, కేతువు దోష పరిహారం నిమిత్తం వచ్చే వారి కోసం ట్రైన్లను ఆపాలని కోరారు.