పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

NTR: మొంథా తుఫానుకు దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలుతో పాటు అధికారులు గురువారం పరిశీలించారు. మండలంలోని తునికిపాడు, దిండిరాలపాడు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలకు తగు సూచనలు చేశారు. తీవ్రంగా తడిచిన ధాన్యం రంగు మారుతుందని దీనికి విరుగుడుగా పలు రకాల మందులు పిచికారి చేయాలని అవగాహన కల్పించినట్లు ఏవో హరీష్ కుమార్ తెలిపారు.