'జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్లస్థలాలు వెంటనే అందజేయాలి'
BHPL: జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. రాష్ట్ర నాయకులు సాగర్, పెద్దపెల్లి ఇన్‌ఛార్జ్ అందె భాస్కరాచారి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వెంటనే అందజేయాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.