శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న డీసీసీబీ ఛైర్మెన్

ADB: శ్రీ కృష్ణుడు చూపిన మార్గంలో నడవాలని డీసీసీబీ ఛైర్మెన్ అడ్డి బోజరెడ్డి అన్నారు. ఆదివారం తాంసి మండలం పొన్నారీ మురళి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆ శ్రీకృష్ణుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా జిల్లా ప్రజలందరికీ ఉండాలని కోరారు. ఆయనతో పాటు మాజీ MPP శ్రీధర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు కౌడల నారాయణ, తదితరులున్నారు.