ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ కోసం మంత్రికి వినతి
NZB: ఆర్మూర్‌లో 15 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఆర్టీసీ బస్టాండ్, బస్ డిపోను నిర్మించాలని MLA పైడి రాకేశ్ రెడ్డి.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులను పెంచాలని విజ్ఞప్తి చేశారు.