కూచిపూడిలో నేడు కలెక్టర్ పర్యటన

కూచిపూడిలో నేడు కలెక్టర్ పర్యటన

కృష్ణా: మొవ్వ మండలం కూచిపూడిలో కలెక్టర్ డీకే బాలాజీ పర్యటించనున్నట్లు మొవ్వ తహశీల్దార్ మస్తాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కూచిపూడి నాట్యక్షేత్రం అభివృద్ధిపై శనివారం ఉదయం 10:30కి కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశానికి జేసీ గీతాంజలి శర్మ ఇతర అధికారులు హాజరవుతారన్నారు.