కాకినాడలో వైసీపీ నేతల నిరసనలు

కాకినాడలో వైసీపీ నేతల నిరసనలు

కాకినాడ: మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు కాకినాడలో శుక్రవారం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రైతాంగ సమస్యలకు వ్యతిరేకంగా పోరుబాట చేపట్టినట్లు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, ముద్రగడ పద్మనాభం, దవులూరి దొరబాబు, తదితరు నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ధర్నాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.