పాఠశాలలో ఫ్యాన్లు విరగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

పాఠశాలలో ఫ్యాన్లు విరగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

RR: ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్యాన్లను విరగొట్టారు. శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవులు కావడంతో దుండగులు పాఠశాలలోకి వెళ్లి విరగ్గొట్టారు. గత నెల రోజుల క్రితం కూడా ఇదే తరహాలో ఫ్యాన్లు, కిటికీలు, రికార్డులు ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.