విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
AKP: అచ్యుతాపురం మండలం కొండకర్ల జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు గ్రామ పెద్దలు కోట్ని శివ, శ్రీను మంగళవారం స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే హైస్కూల్లో చదివిన ఐదుగురు విద్యార్థులు ట్రిబుల్ ఐటీలో సీట్లు సాధించారని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.