నేడు క్వింటాల్ తేజ మిర్చి ధర ఎంతంటే..?
WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.19400 పలికింది. అయితే మంగళవారం క్వింటాల్ తేజ మిర్చి ధర రూ. 200 పెరిగి..19600 పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్లో తేజ మిర్చి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు.