పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి: ఎస్పీ
MBNR: జిల్లాలోని పెండింగ్ కేసులని వేగంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జానకి గురువారం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రతి కేసును పారదర్శకంగా, నిష్పాక్షికంగా విచారించి కేసును పరిష్కరించాలని అన్నారు