VIDEO: భైరవకోన జలపాతం వద్ద భక్తుల సందడి
ప్రకాశం: జిల్లాలోని ప్రముఖ పర్యాటక శైవ క్షేత్రం చంద్రశేఖరపురం మండలం భైరవకోనలో నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలోని జలపాతం వద్ద భక్తులు సందడి చేశారు. జలపాతం వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు అమితాశక్తి చూపారు. అక్కడే పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భైరవేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.