శక్తి యాప్‌పై మహిళలకు అవగాహన
NLR: మహిళలు, పిల్లల రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్ ఆవశ్యకత గురించి ఉదయగిరి పోలీసులు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి యాప్ ప్రతి మహిళ తప్పక డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇది మహిళల రక్షణకు భద్రత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.