ఎంతో భయపడ్డా.. పారిపోవాలనుకున్నా: షారుఖ్

న్యూయార్క్‌లో జరిగిన మెట్‌గాలాలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తొలిసారి పాల్గొన్నాడు. తాజాగా ఆయన రెడ్‌కార్పెట్ అనుభవాన్ని పంచుకున్నాడు. తాను ఎప్పుడూ రెడ్‌కార్పెట్ అనుభవాన్ని పొందలేదని, ఆ సమయంలో ఎంతో భయపడినట్లు చెప్పాడు. అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు పారిపోవాలా అని ఆలోచించానని అన్నాడు. ఈ ఈవెంట్‌లో తాను పాల్గొనడానికి కారణం తన పిల్లలు అని పేర్కొన్నాడు.