ఖతర్‌లో అర్జునపురం వాసి మృతి

కంచిలి మండలం అర్జునపురం గ్రామానికి చెందిన బుద్దెపు గున్నయ్య (53) ఖతర్‌లో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గున్నయ్య కూలి పనుల నిమిత్తం ఖతర్‌కి వెళ్లాడు. పని చేస్తుండగా ఒకేసారి గుండె నొప్పి రావడంతో స్థానిక హాస్పిటల్లో చేర్చారు.చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.