రూ.43.60 లక్షల వ్యయంతో సచివాలయ భవనం ప్రారంభం
ATP: రాయదుర్గం మండలం బీ.ఎన్.హళ్లి గ్రామంలో రూ. 43.60 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శక సేవలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.