నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల
KMR: నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం నీటి విడుదల చేశారు. ప్రధాన కాలువ ద్వారా 4వ విడతలో భాగంగా 1200 క్యూసెక్కుల చొప్పన నీటిని బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కాల్వల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు, రైతులు, కాలువలోకి, కాలువ ఒడ్డు సమీపానికి సమీపానికి వెళ్లవద్దని అధికారులు సూచించారు.