ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

NDL: జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణ శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.