జిన్నారంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని రంగరాముల గుట్ట వద్ద గ్రామస్థులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కటాక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాలుగా ఇక్కడ సామూహిక వ్రతాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.