'ప్రభుత్వ భూముల పరిరక్షనే ధ్యేయం'

SKLM: నీటి వనరులు, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ అధికారి సాయి ప్రత్యూష హెచ్చరించారు. పొందూరులోని సోషల్ క్లబ్ స్థల వివాదంపై పొందూరు తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీవో విచారణ చేపట్టారు. రికార్డుల్లో ఆ స్థలం పంచాయితీదిగా ఉన్నట్టు ఆమె చెప్పారు. ఈ స్థలంపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ ఆదేశించారు.