లక్ష్మీపూర్ హైస్కూల్‌లో ఆలస్యమైన అక్షయపాత్ర భోజనం
WGL:వరంగల్ తూర్పు 26వ డివిజన్‌లోని లక్ష్మీపూర్ హైస్కూల్‌లో అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం ఆలస్యంగా అందుతోందని ఏఐఎఫ్‌డీఎస్ జిల్లా కమిటీ నేడు ఆందోళన వ్యక్తం చేసింది. నిర్ణీత సమయానికి భోజనం రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, గుడ్లు కూడా మూడు వారాలుగా ఇవ్వడం లేదని తెలిపారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.