'రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

SRPT: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ సేవాదళ్ యంగ్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్ల శ్రవణ్ కుమార్ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో యంగ్ బ్రిగేడ్ జిల్లా అధ్యక్షులు కాసర్ల గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడం కోసం కుట్ర చేస్తోందన్నారు.