'గంజాయి వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించము'
VZM: నెల్లిమర్ల మండలంలో గంజాయి వినియోగం, రవాణా, నిల్వలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని నెల్లిమర్ల ఎస్సై గణేష్ ఇవాళ హెచ్చరించారు. గంజాయి సేవిస్తూ పట్టుబడిన పలువురు విద్యార్థులు కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. గంజాయి వల్ల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరమైన తీవ్ర నష్టాలు కలుగుతాయన్నారు.