రాజాపూర్ తై బజార్ వేలంపాట ఎంతంటే..?
MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే వారంతపు సంత (తై బజార్) వేలం పాటను శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీవో వెంకట్ రాములు, సర్పంచ్ రామకృష్ణ సమక్షంలో వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో రూ.2.36 లక్షలకు మండల కేంద్రానికి చెందిన రాకేశ్ సొంతం చేసుకున్నారు. అనంతరం రంగారెడ్డి గూడ గ్రామంలో సంత బజార్ వేలంపాట కొనసాగనుంది.