ఈనెల 7న మన్యంకొండ ఆలయం మూసివేత

MBNR: చంద్రగ్రహణం కారణంగా ఈనెల 7న దాదాపు 12 గంటల పాటు మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం మూసి వేయనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్ తెలిపారు. ఈనెల 7న రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. అర్ధరాత్రి 1:31 గంటలకు ముగుస్తుందన్నారు. గ్రహణ సమయానికి ముందుగానే ఆలయ మూసివేయనున్నట్లు తెలిపారు.