అహోబిలం ఆలయం గురించి తెలుసా.?

అహోబిలం ఆలయం గురించి తెలుసా.?

నంద్యాల జిల్లాలోని అహోబిలం క్షేత్రం అత్యంత శక్తివంతమైన వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో వెలిశారు. అహోబిలం కొండ ప్రాంతం ఎగువ, దిగువ అహోబిలం అనే రెండు ప్రధాన ప్రాంతాలుగా విభజించబడింది. ఈ క్షేత్రంలో స్వామివారు తొమ్మిది రూపాలలో దర్శనమిస్తారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో పచ్చని ప్రకృతి మధ్య నెలకొని ఉంది.