SRTRIలో సాంకేతిక శిక్షణా కోర్సుకు దరఖాస్తులు

యాదాద్రి: భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో డాటా ఎంట్రీ ఆపరేటర్ శిక్షణ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ ఛైర్మన్ కిశోర్ రెడ్డి గురువారం తెలిపారు. ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతితో పాటు ఉద్యోగం కల్పించబడునన్నారు. ఈనెల 15న అడ్మిషన్లు ప్రారంభమగునని తెలిపారు. వివరాలకు 9133908000 సంప్రదించాలని కోరారు.