రహదారిపై చిరుత సంచారం
కామారెడ్డి జిల్లాలో మరోమారు చిరుత సంచారం కలకలం రేపింది. రహదారిపైనే సంచరించడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. వివరాల మేరకు.. లింగంపేట మండలం మిద్ద మెట్టు వద్ద ఎల్లారెడ్డి – కామారెడ్డి రహదారిపై చిరుతను గమనించిన డ్రైవర్ బస్సును ఆపడంతో బస్సులోని ప్రయాణికులు చిరుత కదలికలను వీడియోలు తీసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.