టీడీపీ కార్యాలయంలో జెండా ఎగరవేత

సత్యసాయి: మడకశిర పట్టణంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే MS రాజు క్యాంప్ కార్యాలయం, టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని దేశభక్తి ఉత్సాహాన్ని పంచుకున్నారు.