ఆర్టీసీలో అప్రెంటిస్ మేళా

ఆర్టీసీలో అప్రెంటిస్ మేళా

మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని నిరుద్యోగులకు డిపో పరిధిలో మూడేళ్ల పాటు అప్రెంటిస్ నిర్వహిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ విజయ భాస్కర్ తెలిపారు. ఇంజినీరింగ్ ఐటీ, కంప్యూటర్ సైన్స్‌లో 2021 సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ మేళాకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 21 నుంచి 27లోగా దరఖాస్తుకు చేసుకోవాలని అన్నారు.