ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

SRD: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్‌గా వాతావరణ శాఖ ప్రకటించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని అన్నారు. ప్రజలు వాగులు, చెరువులు, కుంటల దగ్గరికి వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపారు.