మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎమ్మెల్యే

మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎమ్మెల్యే

CTR: గంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శనివారం మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా, నాణ్యత ఎలా ఉందో పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో నిర్వహణ సక్రమంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు బాస్కెట్‌బాల్ కోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.