రాజమండ్రిలో భారీ వర్షం

E.G: అల్పపీడనం & ద్రోణి ప్రభావంతో రాజమండ్రిలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వర్షం ప్రారంభం కావడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.