మైనర్లకు పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఐ
NZB: 18 ఏళ్ల లోపు మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం చట్టరీత్యా నేరమని బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు హెచ్చరించారు. సాలూరలోని కిరాణా దుకాణాల వద్ద ఆయన పోలీసు సిబ్బందితో కలిసి అవగాహన పోస్టర్లను అంటించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా నిషేధిత హెచ్చరిక బోర్డులు ఉండాలని స్పష్టం చేశారు.